రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ విడుదలకు సిద్ధమైంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా టాలీవుడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టించింది. కేవలం రెండు సాంగ్స్, రెండు గ్లింప్స్‌లతోనే ప్రకంపనలు సృష్టించి సినీ ఫ్యాన్స్‌ని అలర్ట్ చేసింది. జూన్ 4 విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో, చరణ్-బుచ్చిబాబు కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లిన ఓ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి అప్డేట్ అందించారు.
వీడియోలో బుచ్చిబాబు మాట్లాడుతూ,“సినిమా విడుదలకు ఇంకా 3 వారాలే ఉంది. ఈ టెన్షన్ మధ్య నన్ను లాంగ్ డ్రైవ్‌కు తీసుకొచ్చిన వ్యక్తి మరెవరో కాదు, మన రామ్ చరణ్ సర్” అన్నారు. అనంతరం “ఇంత బిజీ షెడ్యూల్లో నన్ను డ్రైవ్‌కు తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ చరణ్ సర్” అని చెప్పగా, దానికి రామ్ చరణ్ సరదాగా స్పందిస్తూ, “అది సరే.. మన ‘పెద్ది’ ఎప్పుడు వస్తుందో ముందు అది చెప్పు” అన్నారు.
ఈ సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా, ఇది ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో భాగమని చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలో చరణ్–బుచ్చిబాబు మధ్య ఉన్న బాండింగ్‌కి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
“Driving through memories and moments of #PEDDI ❤️”
— PEDDI (@PeddiMovieOffl) May 15, 2026
Ft. #PEDDI and #THALA ❤️🔥
Full Drive Out today 💥
Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥 pic.twitter.com/iSXwjSx6Kk
ముంబైలో ట్రైలర్ లాంచ్..
జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా కోసం కేవలం 15 రోజుల్లోనే దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయనున్నారు. ఈ యాత్ర మే 18న ముంబైలో మొదలవుతుంది. అక్కడ అత్యంత భారీగా ‘పెద్ది’ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. కుస్తీ వీరుడిగా, క్రికెటర్‌గా చరణ్ విశ్వరూపాన్ని ఈ ట్రైలర్లో చూడబోతున్నామనే వార్త ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
►ALSO READ | కేడీ ది డెవిల్ మూవీ తెలుగు వర్షన్ ఇవాళే ( మే 15 ) విడుదల
ఉప్పల్ స్టేడియం షేక్..
ప్రమోషన్లలో అత్యంత ఆసక్తికరమైన అంశం మే 22న ఉప్పల్ స్టేడియంలో ప్లాన్ చేసిన ఈవెంట్. ఐపీఎల్లో భాగంగా ఆరోజు జరిగే RCB vs SRH మ్యాచ్ మధ్యలో రామ్ చరణ్ సందడి చేయబోతున్నారు. అదే వేదికపై ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్‌తో స్టేడియం దద్దరిల్లిపోనుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో ఈ రకమైన పబ్లిసిటీ ఇండియాలో మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా మే 23న భోపాల్‌లో పెద్ది నుంచి స్పెషల్ సింగ్ రిలీజ్ కానుంది.
#PEDDI - Mana Cinema Aadukodam Gurinche 💥
— PEDDI (@PeddiMovieOffl) May 14, 2026
Get ready for the games 🥰
In cinemas JUNE 4th ❤️ https://t.co/f41uSE09yc pic.twitter.com/4QChYp8BxW
