
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది (PEDDI). బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో నిర్మించిన గ్రామీణ సెట్‌లో జరుగుతుంది. ఇందులో కీలకమైన టాకీ సన్నివేశాలు మరియు హై-ఆక్టేన్ స్టంట్ సీక్వెన్స్‌ను బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను బుచ్చిబాబు షేర్ చేశారు. 'యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి స్వింగ్‌లో ఉంది. మార్చి 27, 2026న గ్లోబల్ రిలీజ్' అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు.
An Action Packed Schedule in full swing @AlwaysRamCharan sir 🔥❤️🤗@divyenndu bro 😍🤗#BTS #Peddi
— BuchiBabuSana (@BuchiBabuSana) May 22, 2025
GLOBAL RELEASE ON 27th March 2026💥 pic.twitter.com/mEyoyBQP6O
ఈ విలేజ్ సెట్ను డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలోని నిర్మాణ బృందం రూపొందించింది. మట్టి సౌందర్యాన్ని ప్రతిబింబించే వాస్తవిక గ్రామీణ నేపథ్యాన్ని సృష్టించడంలో తన బృందం ఎలా కష్టపడుతుందనేది లేటెస్ట్ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది.
బుచ్చిబాబు పంచుకున్న ఫొటోల్లో రామ్ చరణ్, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ ఉన్నారు. రామ్ చరణ్ పొడవాటి జుట్టు, మందపాటి గడ్డం, ముక్కుపుడకతో గ్రామీణ అవతారంలో ఉన్నాడు. దివ్యేందు శర్మ లుక్ సైతం ఇంప్రెస్స్గా ఉంది. కాగా దివ్యేందు హిందీలో మీర్జాపూర్ అనే వెబ్ సీరీస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో డజనుకుపైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ సీనియర్ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
'పెద్ది' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. ఎఆర్ రెహమాన్ స్వరాలూ సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా మార్చి 27, 2026న థియేటర్లలో రిలీజ్ కానుంది.