రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!..రిలీజ్ ఎప్పుడంటే?

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!..రిలీజ్ ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్ లో వస్తన్న మోస్ట్ వాంటెడ్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తున్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుండి సాంగ్ లీకైందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జాబిలమ్మ అంటూ సాగిన ఈ పాట సగానికన్నా ఎక్కువే లీకైన విషయం తెలిసిందే.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్వరలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. ఈ నెల (అక్టోబర్28న) ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలో మేకర్స్ నుంచి  అధికారక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. లీకైన సాంగ్ రిలీజ్ చేస్తున్నారా? లేక కొత్త సాంగ్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా అనే క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 

ఇక గేమ్‌ ఛేంజర్‌ సినిమా విషయానికి వస్తే.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కనిపిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు 
తమన్  (Thaman) సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.