
టాలీవుడ్ ప్రముఖ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ప్రముఖ విలక్షణ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ స్టార్ సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ పూర్తీ చేసుకుని రిలీజ్ కి సిద్దంగా ఉంది.
ఈ క్రమంలో ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానకుగా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల రిలీజ్ డేట్ మారినట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో గేమ్ చేంజర్ చిత్ర రిలీజ్ పై నిర్మాత దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
ఇందులో భాగంగా మొదట్లో ఈ చిత్రాన్ని క్రిస్మస్ సీజన్‌కి విడుదల చేయాలని అనుకున్నాం, అయితే నార్త్ ఇండియా, తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్తో సహా మా డిస్ట్రిబ్యూటర్లందరూ ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలనుకున్నామని దీంతో సంక్రాంతి బరిలో ఉన్న విశ్వంభర సినిమా టీంతో మాట్లాడి గేమ్ చేంజర్ ని సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ALSO READ : అన్ స్టాపబుల్ సీజన్ 4.. దెబ్బకి థింకింగ్ మారాలంటున్న బాలకృష్ణ
అలాగే గేమ్ చేంజర్ కోసం విశ్వంభర చిత్రం రిలీజ్ డేట్ ని మార్చుకున్నందుకు చిరంజీవి మరియు యూవీ క్రియేషన్స్ టీమ్ కి థ్యాంక్స్ చెప్పారు. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై వినిపిస్తున్న పుకార్లకి పులిస్టాఫ్ పడింది.
ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం నుంచి రెండు పాటలు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో త్వరలోనే గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా షురూ చేస్తామని నిర్మాత దిల్ రాజ్ తెలిపారు.