ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాపైనే టాలీవుడ్ ఇండస్ట్రీ భవిష్యత్తు కనిపిస్తుంది. సంక్రాంతి పండగ తర్వాత పెద్ద సినిమాలు లేక ఆడియన్స్, డిస్ట్రిబ్యూటర్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే రేపు (జూన్ 4న) రిలీజ్ కానున్న పెద్ది కోసం ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నీ థియేటర్లలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
ఈ సందర్భంగా ఆడియన్స్ బుకింగ్ సైట్లపై దండయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడచూసిన బుక్ చేసుకున్న స్క్రీన్‌షాట్లను పంచుకుంటూ సినిమాపై ఉన్న ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలంగాణ గవర్నమెంట్ పెంచిన రేట్లతో సింగిల్ & మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్క టికెట్ ధర ఎంతనేది చూద్దాం.
తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ ధరలు:
సింగిల్ స్క్రీన్ థియేటర్లు:
3వ క్లాస్ టికెట్: రూ.150 (జీఎస్‌టితో కలిపి రూ.173)
డ్రెస్సింగ్ సర్కిల్: రూ.225 (జీఎస్‌టితో కలిపి రూ.254)
బాల్కనీ: రూ.275 (జీఎస్‌టితో కలిపి రూ.308)
మల్టీప్లెక్స్ థియేటర్లు:
గోల్డ్ కేటగిరీ: రూ.420 (జీఎస్‌టితో కలిపి రూ.462)
రిక్లైనర్: రూ.475 (జీఎస్‌టితో కలిపి రూ.560)
తెలంగాణలో 'పెద్ది' సినిమాకు 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చి టికెట్ ధర రూ.600గా, అలాగే 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. pic.twitter.com/EIXah1BbSr
— TG Govt Updates (@TGGovtUpdates) June 3, 2026
రూ. 600తో ప్రీమియర్ షోలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 8 గంటలకు స్పెషల్ షోలు పడనున్నాయి. ఈ స్పెషల్ షో టికెట్ ధరను జీఎస్‌టీతో కలిపి రూ. 600గా నిర్ణయించారు. అయితే, ఈ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని ఫిల్మ్ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా వెల్లడించింది.
ఇక అన్నీ వైపులా పెద్దికి లైన్ క్లియర్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే, నార్త్ అమెరికాలో అయితే, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్లో దూకుడు కనబరుస్తుంది.
భారీ ఓపెనింగ్స్ ఖాయమేనా?
అన్ని అనుమతులు, ప్రత్యేక షోలతో ‘పెద్ది’కి మార్గం సుగమం కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మంచి జోరు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్ ట్రెండ్ చూస్తుంటే, తొలి రోజు వసూళ్ల విషయంలో ‘పెద్ది’ కొత్త రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
#PEDDI Ready to enter the GROUND from today ⚡️
— PEDDI (@PeddiMovieOffl) June 3, 2026
Grand PREMIERES and full fledged bookings open now 💥💥💥https://t.co/EMhY3eMGKq
Book your tickets ⚡️#PEDDI Grand Premieres from today, Grand Release On June 4th💥💥 pic.twitter.com/ppTYpaOM7V
