ఫ్యాన్ ప్రతిభకు మెచ్చి, ఆర్థిక సాయం చేసిన రామ్ చరణ్

ఫ్యాన్ ప్రతిభకు మెచ్చి, ఆర్థిక సాయం చేసిన రామ్ చరణ్

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ అనగానే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్ చరణ్ కు కూడా తండ్రి బాటలో నడుస్తూ.. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే తన నటనతో, స్టైల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న చెర్రీకి. ఓ ఫ్యాన్ ఆయన పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు. దాంతో సరిపెట్టుకోకుండా దాదాపు 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరీ చరణ్ ను కలిసి, తన కల నెరవేర్చుకున్నాడు ఆ అభిమాని. అంతులేని అభిమానాన్ని చూపిన అతని ప్రతిభకు, ప్రేమకు పడిపోయిన రామ్ చరణ్.. ఆర్థిక సాయం చేయడమే కాక, సినీపరిశ్రమలో తగిన స్తానం కల్పిస్తామని మాట ఇవ్వడం నిజంగా చెప్పుకోదగిన విషయం.

 గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి  ప్రాంతం లో జైరాజ్ అనే వ్యక్తి పొలాల్ని కౌలుకు  తీసుకుని కాలం వెల్లదీస్తున్నాడు.  ఎప్పుడూ ఏదైనా కొత్తగా  చేస్తేనే నలుగురి మెప్పు పొందుతామన్న  విజయ సూత్రాన్ని నమ్మిన జైరాజ్... మెగాహీరోలకు వీరాభిమాని. చిన్నతనం నుంచి చిత్రలేఖనం పట్ల అభిరుచి పెంచుకున్న ఆయన.. తనఫెవరెట్ హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రాల్ని పొలాల్లో పండించి  ఆకాశమంత  అభిమానాన్ని చాటుకుంటున్నారు. చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా అప్పట్లో  జైరాజ్ వరిచిత్రాల్ని  పండించారు. గొర్లఖాన్ దొడ్డి  పొలాల్లో పండించిన ఈ రాంచరణ్ వరి చిత్రం ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకుంది. 

 

వరి పొలాల్లో  రామ్ చరణ్ చిత్రాన్ని  పండించేందుకు జైరాజ్ కు మూడు నెలలు పట్టినట్టు తెలిపాడు. వరి నాట్లతో వేసిన మెగా హీరో చిత్రం పై నుంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆ నటుడి పుట్టినరోజున ఏదైనా చేయాలన్న పట్టుదలతో శ్రమించి.. అభిమాన హీరో చిత్రం వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ఇటీవలే రామ్ చరణ్ ను కలిసేందుకు తన ఊరినుంచి హైదరాబాద్ లో ని రాంచరణ్  ఇంటిదాకా 264  కిలోమీటర్లు  పాదయాత్ర  చేసి మరీ ఆయన్ని కలుసుకున్నానని, ఆ కలుసుకున్న క్షణాలను గుండెల్లో పెట్టుకుని భద్రపరుచుకున్నారంటున్నానని జైరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. అమ్మ నాన్న లేరని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానన్న జైరాజ్... చరణ్ వరిచిత్రాన్ని పొలాల్లో పండించేందుకు వేల రూపాయలదాకా ఖర్చయిందన్నారు. అయితే US లో ఉన్న విజయ్ రేపల్లె గారు ఈ చిత్రాలు పండించేందుకు  అయ్యే ఖర్చును భరించారని జైరాజ్ చెప్పారు. 

ఈ విషయం తెలుసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. జైరాజ్ ని తన నివాసానికి పిలిపించుకుని సుమారు 45  నిముషాలు మాట్లాడి అతనికి  ఆర్థిక సహాయం చేయడమేగాక, అతని మేధస్సు మెచ్చుకుని సినీపరిశ్రమలో తగిన స్తానం కల్పిస్తామని మాట ఇచ్చి, తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా జైరాజ్ మాట్లాడుతూ  మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని తెలపడం కొసమెరుపు .

 

మరిన్ని వార్తల కోసం...

బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి రూ. 3.82 లక్షలు చోరీ

రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన