Ram Charan: ఆస్ట్రేలియాలో ప్రత్యేక శిక్షణ.. RC16 లేటెస్ట్ అప్డేట్

Ram Charan: ఆస్ట్రేలియాలో ప్రత్యేక శిక్షణ.. RC16 లేటెస్ట్ అప్డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఆయన తరువాతి ప్రాజెక్టు RC 16 కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లనున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రూరల్ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో భారీ సినిమా చేస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ సినిమా కోసమే రామ్ చరణ్ మరికొన్నిరోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లనున్నాడట. 

అవును.. ఆర్సీ 16 కోసం రామ్ చరణ్ అక్కడ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడట. అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత అక్టోబర్‌ నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడట రామ్ చరణ్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రా అండ్ రస్టిక్ గా కనిపించనున్నాడట. అందుకే ఈ సినిమా కోసం చాలా శ్రద్ద తీసుకుంటున్నాడట. వచ్చే ఏడాది విడుదల అయ్యే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.