
ఓ పైపు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్.. ఇది పూర్తి కాకముందే బుచ్చిబాబు డైరెక్షన్‌లో సినిమా స్టార్ట్ చేశాడు. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ అనౌన్స్ చేశాడు. గేమ్ చేంజర్ చిత్రం దాదాపు పూర్తి కావొచ్చింది. దీంతో తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు చరణ్. జూన్ సెకెండ్ వీక్ నుంచి బుచ్చిబాబు రూపొందించనున్న చిత్రంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్‌సీ 16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. దీనికోసం చరణ్ కంప్లీట్ మేకోవర్‌తో కనిపించనున్నాడు.
జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. మైత్రీమూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి.. ఎండింగ్‌లో సుకుమార్ సినిమాను మొదలుపెట్టేలా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉన్నాడు రామ్ చరణ్. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న చరణ్.. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.