కేసు పెట్టారంట : రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు

కేసు పెట్టారంట : రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). గత నెల నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వ్యూహాన్ని సెన్సార్ బోర్డు రిలీజ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జీవీ వెనక్కడుగు వేయకుండా..పట్టు వదలని విక్రమార్కుడిలా తన వ్యూహాలతో..ఎట్టకేలకు వ్యూహం రిలీజ్ డేట్ ని డిసెంబర్ 29 కి తీసుకొచ్చాడు.

తీరా రిలీజ్ అయ్యే సమయానికి..టీడీపీ కార్యకర్తల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వర్మ ఆఫీసుల ముందు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే..అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీనివాసరావు ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సమాజానికి తన సినిమాలతో కంటకంగా మారిన డైరెక్టర్ ఆర్జీజీ తల నరికి తెస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని టీవీ షో డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలపై..రామ్ గోపాల్ వర్మ మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఎక్స్‌లో ఓ పోస్టు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులను ట్యాగ్ చేసి, దీనిని తన అధికారిక ఫిర్యాదుగా పరిగణించాలని అభ్యర్థించారు.అలాగే ట్విట్టర్ లో వర్మ స్పందిస్తూ..నివారిస్తున్నట్టు నటిస్తూనే ఆ కొలికపూడి శ్రీనివాసరావు తో నన్ను చంపించటానికి మూడు సార్లు కాంట్రక్ట్ ఇప్పించావుగా సాంబా ..జస్ట్ వెయిట్ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 

వ్యూహం సినిమాలో తీసుకున్న కంటెంట్..ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో కూడుకున్నది కావడం, ఈ చిత్రంలోని పాత్రలకు నిజజీవిత పేర్లు పెట్టడంపై కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తమ నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులపై చూపించకూడని అ వాస్తవ సంఘటనలు..ఇలా ఎలా చిత్రీకరించి..సినిమాలు చేస్తారని ఫైర్ అవుతున్నారు. ఇదంతా తమ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, అభూత కల్పనలతో వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారనే వాదనలు ప్రచారంలో ఉండటంతో సినిమా విడుదలపై సందేహం నెలకొంది.