సెన్సార్లో చిక్కుకున్న ఆర్జీవీ వ్యూహం..రిలీజ్ క్లారిటీపై ఫ్యాన్స్ వెయిటింగ్

సెన్సార్లో చిక్కుకున్న ఆర్జీవీ వ్యూహం..రిలీజ్ క్లారిటీపై ఫ్యాన్స్ వెయిటింగ్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) లేటెస్ట్ మూవీ వ్యూహం (Vyuham). ఈ మూవీ వాస్తవానికి రేపు (నవంబర్ 10 న) రిలీజ్ కావాల్సి ఉండగా..ఉన్నట్టుండి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో రిలీజ్ క్లారిటీపై ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

సినిమాలోని పాత్రలు నిజజీవిత వ్యక్తులను ప్రభావితం చేసేలా ఉన్నాయని, పేర్లు కూడా అవే ఉండటంతో  సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యకం చేసింది. దీనిపై రివైజింగ్ కమిటీకి వెళ్లాలని సూచించింది. మరి ఇపుడు ఇదే విషయంపై.. RGV ఫ్యాన్స్ లో సినిమా రిలీజ్ విషయంపై ఉత్కంఠ నెలకొంది. అసలు రివైజ్ కమిటీ ఏం చెప్పింది..వ్యూహం సినిమా విషయంలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. 

రివైజ్ కమిటీ సభ్యులలో జీవిత రాజశేఖర్ కూడా ఒక సభ్యురాలిగా ఉన్నారు. దీంతో వ్యూహం సినిమా సెన్సార్ ఇస్స్యూ లో ఓ క్లారిటీ వస్తోందని అనుకునే లోపే..ప్రొడ్యూసర్ నట్టికుమార్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ లో రీసెంట్ గా వ్యూహం సెన్సార్ పై వీడియో షేర్ చేశారు.  

నట్టికుమార్ మాట్లాడుతూ..ఈ రీవైజ్ సెన్సార్ కమిటీలో ఉన్న జీవిత రాజశేఖర్ ను..ఈ సినిమా వరకు సెన్సార్ చేయకుండా తప్పించాలని..సెన్సార్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ హైకోర్టులో కూడా కేసు వేసి..జీవిత రాజశేఖర్ గతంలో వైసీపీ, ఇప్పుడు బీజేపీలో ఉన్నారని, ఆమె రివైజ్ కమిటీలో ఉంటే వ్యూహం సినిమా సెన్సార్ కు న్యాయం జరగదని వెల్లడించారు.

ఎందుకంటే, రాజకీయల్లో ఉన్న నాయకులతో తప్ప..ఉన్నత పదవుల్లో ఉన్న వేరే వ్యక్తులతో సెన్సార్ చేయాలనీ కోరారు. అవసరమైతే..వ్యూహం సినిమా సెన్సార్ ను పక్క రాష్ట్రాలైన ముంబై సెన్సార్ బోర్డు కు గానీ, కర్ణాటక సెన్సార్ బోర్డు కు గానీ పంపించాలని కోరారు. 

దీంతో నట్టికుమార్ ఫిర్యాదుపై ..కోర్టు వాదనలు ముగిసాయి. ఈ కేసును కోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది. అలాగే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కూడా వస్తుండటంతో..ఈ సెన్సార్ వ్యవహారం మరింత కష్ట తరంగా మారేట్లు కనిపిస్తోంది. మరి ఇప్పటి వరకి అయితే..వ్యూహం సినిమా వాయిదా పడినట్లేనని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే RGV మాత్రం తగ్గేదేలే అన్నట్లు సోషల్ మీడియాలో వ్యూహం సినిమా ప్రమోషన్స్ ని కానిచ్చేస్తున్నాడు.