వ్యూహం నుండి చిరు, పవన్ లుక్స్ రిలీజ్.. 2+2=1 అంటున్న వర్మ

వ్యూహం నుండి చిరు, పవన్ లుక్స్ రిలీజ్.. 2+2=1 అంటున్న వర్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal varma) తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం(Vyooham). వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదం, YSR మరణించిన తర్వాత ఎం జరిగింది వంటి నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

ఇక తాజాగా ఈ సినిమాలోని మరో రెండు పాత్రలను పరిచయం చేశారు వర్మ. దీనికి సంబందించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పాత్రలు చూస్తుంటే అవి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. ఈ పాత్రలు పరిచయం చేస్తూ షేర్ చేసిన ఫోటోకి.. “2+2=1” అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ALSO READ:కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. తేల్చేసిన వీరేంద్ర సెహ్వాగ్

దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో జగన్ పాత్రలో అజ్మల్ అమీర్, వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృషన్ నటిస్తున్నారు.