RGV on Kiara: కియారా బికినీపై వర్మ అసభ్యకర కామెంట్స్.. ట్వీట్‌ డిలీట్.. ఏమన్నాడంటే?

RGV on Kiara: కియారా బికినీపై వర్మ అసభ్యకర కామెంట్స్.. ట్వీట్‌ డిలీట్.. ఏమన్నాడంటే?

కియారా అద్వానీ (Kiara Advani) వార్ 2 బికినీ షాట్పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ట్వీట్ చేశాడు. నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో X ఖాతా నుండి తన ట్వీట్‌ను సడెన్గా తొలిగించేశాడు. 

బికినీ ఫోటోలను షేర్ చేస్తూ వర్మ Xలో ఇలా వ్రాశాడు, "దేశాల కోసం కాకుండా, ఆమె బ్యాక్ కోసం హృతిక్, తారక్ మధ్య వార్ జరిగితే, వార్ 2 బ్యాక్ బస్టర్ అబుతుంది" అంటూ అసభ్యకర క్యాప్షన్ ఇస్తూ ఫోటో షేర్ చేశాడు.

అంతేకాకుండా ఎన్టీఆర్, హృతిక్ క్లోజప్ షాట్స్‌ను పెట్టి, ఆ కళ్లే చెబుతున్నాయని అంటూ మరో పోస్ట్ కూడా పెట్టాడు. దాంతో టాలీవుడ్, బాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు వర్మ.

రామ్ గోపాల్ వర్మ భాయ్, ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్తా ఆలోచించండి.. అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్‌ సలహా ఇచ్చాడు.  మరొక యూజర్ "అతను చాలా సంవత్సరాల క్రితం దాన్ని పోగొట్టుకున్నాడు. అషు రెడ్డి మరియు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ డాక్యుమెంటరీతో ఆయన ఇంటర్వ్యూ మీరు చూడలేదా?" అని కామెంట్ చేశాడు.

ఇంకొందరైతే.. వోడ్కా వేసిన తర్వాత ఇలాంటి ఆలోచనలు తప్పా నీకు ఎలాంటివి వస్తాయి లే అని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఆ వెంటనే ఆర్జీవీ తన పోస్ట్ను డిలేట్ చేయడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. దీన్నీ బట్టి అతను మత్తులోనే ఉండి ఈ పోస్ట్ చేసినట్లు మరికొందరి కామెంట్స్ చేస్తున్నారు. 

వార్ 2 టీజర్:

వార్ 2 టీజర్‌లో హృతిక్ రోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా నటించిన కియారా అద్వానీ బికినీలో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఎల్లోష్ గ్రీన్  బికినీలో కియారా కనిపించి తళుక్కుమన్నది. ప్రస్తుతం ఈ బికినీ లుక్ సోషల్ మీడియాను హోరెత్తిచ్చేస్తోంది. ఈ క్రమంలో బికినీ ఫొటోలు, వీడియోలు నెటిజన్లు తెగ షేర్ చేస్తు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో వైరల్ చేసేస్తున్నారు. 

ఇద్దరు స్టార్ హీరోలను కియారా పూర్తిగా డామినేట్ చేసేశారని.. ఇది తాము ఏ మాత్రం ఊహించలేదని, కియారా బికినీలో అదిరిపోయారని మరికొందరు సరదాగా కామెంట్లు చేసేస్తున్నారు. ఇకపోతే, వార్ 2 లో తన తొలి ప్రయత్నంలో కియారా ఈ బికినీ ధరించడం విశేషం. 

యాక్షన్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడు. యశ్ రాజ్  ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.