
సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). ఏపీ సీఎం జగన్ రాజకీయ ప్రస్థానంపై ఆర్జీవీ తెరకెక్కిస్తున్న మొదటి పార్ట్ వ్యూహం. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'U' సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్గా వ్యూహం సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ . రాజకీయాల్లో సాగే నటనలు, నిజ జీవితాల్లో కనబడే అపోహలుగా అన్నట్లు ట్రైలర్ లో సాగే సంభాషణలు బట్టి అర్ధం అవుతోంది. ట్రైలర్ స్టార్ట్ అవుతూనే..ఇంతకాలం మిమ్మల్ని పైకి రాకుండా తోక్కేసిన మనిషి..ఇపుడు పైకే పోయాడు..ఇక మీరే..అంటూ చంద్రబాబు అసలు రూపం చెప్పే ప్రయత్నం చేశారు. ఓదార్పు యాత్రలో జనం వచ్చింది నాన్న మీద ప్రేమతో అంటూ వైస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేశారు. ఇక ఈ కొత్త ట్రైలర్ తో ఓ జగన్ ఫ్యాన్స్..వర్మ ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekhara reddy) మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? జగన్ ఏపీ సీఎం ఎలా అయ్యారు? అనే కథాంశాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లో విడుదల అవ్వాల్సిన సినిమా..కొత్త రిలీజ్ డేట్ రావడంతో సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ షురూ అయ్యింది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తోన్న వ్యూహం డిసెంబర్ 29న థియేటర్లోకి వస్తోంది..