RGV Saaree : ఓటీటీలోకి ఆర్జీవీ 'శారీ'.. వివాదాస్పద చిత్రంపై మళ్లీ ఆశలు!

 RGV Saaree :  ఓటీటీలోకి ఆర్జీవీ 'శారీ'..   వివాదాస్పద చిత్రంపై మళ్లీ ఆశలు!

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV), తనదైన శైలిలో రూపొందించిన 'శారీ' (Saaree) చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఏప్రిల్, 4, 2025లో థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా ఆదరణ పొందలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే  ఈ బోల్డ్ సినిమా, ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్  'ఆహా '(Aha) లో జూలై 11, 2025 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆర్జీవీ కథ, సమర్పణ బాధ్యతలు చూసుకున్నారు.

'శారీ'కి కొత్త ప్లాట్‌ఫామ్
ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవల లయన్స్‌గేట్ ప్లేలో విడుదలైంది. అయితే, లయన్స్‌గేట్ ప్లే భారతీయ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని ప్లాట్‌ఫామ్ కావడంతో సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఇప్పుడు ఆహా వంటి ప్రముఖ ఓటీటీ వేదికపైకి 'శారీ' రావడం ద్వారా సినిమాకు విస్తృత ఆదరణ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్జీవీ మార్క్ బోల్డ్‌నెస్, గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన తీరు, అలాగే ఆరాధ్య దేవి నటన.. ఇవన్నీ సినిమాను మరోసారి వార్తల్లో నిలబెట్టాయి.

 

చిత్ర బృందం వివరాలు
ఈ చిత్రంలో సత్య యాదు కీలక పాత్రలో నటించగా, సాహిల్ సంభ్యాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత సహాయక పాత్రల్లో కనిపించారు. ఆనంద్ రాగ్ సంగీతం అందించిన ఈ సినిమాను రవి శంకర్ వర్మ నిర్మించారు. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని 'శారీ', ఆహా ద్వారా డిజిటల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్జీవీ బ్రాండ్ ఇమేజ్, వివాదాస్పద చిత్రాలకు ఆయన ఇచ్చే ప్రచారం.. ఈ సినిమాకు ఓటీటీలో కొంతమంది ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో వేచి చూడాలి.