పుల్వామా దాడి కేంద్రం పనే..

పుల్వామా దాడి కేంద్రం పనే..

ఎస్పీ మాజీ నేత రాం గోపాల్‌ వివాదాస్పద కామెంట్స్‌

న్యూఢిల్లీ: పుల్వామా దాడి వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని  సమాజ్ వాది పార్టీ మాజీ నేత రాం గోపాల్ యాదవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. పుల్వా మా మారణహోమానికి  మోడీ నేతృత్వంలోని కేం ద్ర ప్రభుత్వమే స్కె చ్ వేసిం దని మండిపడ్డారు. కేంద్రం లోని  కొంతమంది కీలక నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ ప్రయోగించి లోక్‌ సభ ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి భారీ కుట్ర పన్నారని మండిపడ్డారు. సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ల బలిదానాన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై ఎలాంటి బారికేడ్లు లేకపోవడంపైనా రాం గోపాల్‌‌ అనుమానం వ్యక్తం చేశారు. సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లను విమానంలోగాని, స్పెషల్‌‌ వెహికల్స్‌ లోగాని  తరలించారని పారామిలటరీ బలగాల చీఫ్‌ లు కోరినా పట్టించుకోకుండా కావాలనే ప్రభుత్వం  ఆర్డనరీ బస్సుల్లో తరలించారని ‌ఆరోపించారు. కేంద్రం లో మోడీ సర్కారు గద్దెదిగ్గిన తర్వాత ఈ ఘటన పై దర్యాప్తు జరపుతామన్నారు .

ఖండించిన సీఎం యోగి

రాం గోపాల్ యాదవ్ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ము-ఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ సీరియస్‌ అయ్యారు .తాజా ఆరోపణలు నీచ రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు . జవాన్ల వీర మరణంపై ప్రశ్నలు లేవనెత్తి సెక్యూరిటీ బలగాల మనోస్థయిర్యాన్ని దె బ్బతీశారని మండిపడ్డారు. వెంటనే రాం గోపాల్ యాదవ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని యూపీ సీఎం డిమాండ్ చేశారు