
ఉస్తాద్ రామ్(Ustaad Ram), మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కాంబినేషన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ స్కంద (Skandha). సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, థియేటర్ ఆడియన్స్ ను అంతగా మెప్పించలేకపోయింది.
ఇదిలా ఉంటే..ఇప్పుడు ‘స్కంద’ మూవీ యూట్యూబ్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. దీని హిందీ వెర్షన్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. జూన్ 17న ‘స్కంద’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మిలియన్‌కు పైగా లైక్‌లు వచ్చాయి. దీంతో రామ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
స్కంద యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన తక్కువ టైంలోనే (నెలన్నరలోపే) ఈ స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకోవడంతో..రామ్ మాస్ మేనియాను ఎంజాయ్ చేస్తోన్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా మంచి వ్యూయర్‌షిప్ పొందడం విశేషం. ఈ మేరకు మాసివ్ ఎనర్జిటిక్ కాంబో మ్యాడ్‌నెస్ కొనసాగుతుంది..అంటూ స్కంద ప్రొడక్షన్ హౌస్ తెలిపింది.
ఇప్పటికే, మన తెలుగు సినిమాలు కొన్ని హిందీ వెర్షన్ లో చాలా ఫేమస్ అవుతూ వస్తున్నాయి. ఉదాహరణకి ప్రభాస్ సాహో చిత్రం తెలుగులో కంటే హిందీలోనే బాగా ఆడింది. అక్కడి ఆడియన్స్‌ను ఈ యాక్షన్ సినిమా బాగా ఆకట్టుకుంది. అలానే బెల్లంకొండ శ్రీనివాస్ తీసిన చాలా సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్లకి యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
The Massive Energetic Combo Madness Continues❤️??
— Srinivasaa Silver Screen (@SS_Screens) July 25, 2024
Blockbuster director #BoyapatiSreenu and Ustaad @ramsayz's High-Octane Action Entertainer #Skanda Hindi crosses staggering 100 M+ views with 1 Million+ likes on YouTube???
Watch here ?https://t.co/ZHeV26ea0U@sreeleela14… pic.twitter.com/eElWkmqbvs
గతంలో బోయపాటి డైరెక్ట్ చేసిన జయ జానకి నాయక, వినయ విధేయ రామ లాంటి సినిమాలకు కూడా నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే దిశగా స్కంద సినిమా కూడా మంచి వ్యూస్ రాబట్టడం ఆసక్తికరమైన అంశం అని చెప్పాలి. ప్రస్తుతం రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.