
అయోధ్యలో రామాలయం ప్రారంభమై ఆరు నెలలు గడవకముందే పైకప్పు లీక్ అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు లీక్ కావడంతో ఆలయంలో, చుట్టుపక్క ల కాంప్లెక్స్ లోకి నీరు వచ్చి చేరిందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 22న రామ్ లల్లాకు పట్టాభిషేకం జరిగింది. ఇంకా ని ర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. పైకప్పు లీకేజీలతో ఆలయ ఆవరణలో నీరు నిలిచి పోయిందని సత్యేంద్ర అన్నారు. అయితే కొత్తగా నిర్మించిణ ఆలయం ఎందుకు లీక్ అవుతుందో తెలుసుకోవడంపై దృష్టిసారించామన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్యలోని మౌలిక సదుపాయలకు కూడా నష్టం కలిగిందన్నారు ఆచార్య సత్యేంద్ర దాస్. భారీ వర్షం కారణంగా కొద్ది గంటల్లో రామ్ పథ్ లోని మూడు ప్రాంతాలతోపాటు ఐదు ప్రధాన రహదారులు డ్యామేజీ అయ్యాయి. రికాబ్ గంజ్ లో రోడ్డు లోని చౌక్ సమీపంలో , పోలీస్ లైన్ల ముందు పెద్ద గుంతలు ఏర్ప డ్డాయి. పుష్పరాజ్ చౌరాహా-ఫతేగంజ్ రోడ్డు కూడా దెబ్బతిన్నది. అయోధ్య లోని రోడ్ల నిర్మాణాల పనులు నాణ్యత లేవని స్థానికులు అంటున్నారు.
सड़क तो सड़क
— Atul Londhe Patil (INDIA Ka Parivar)?? (@atullondhe) June 24, 2024
पूल तो पूल
परीक्षा तो परीक्षा
मंदिर में भी घपला करने से नहीं चुकते
बरसात की शुरुआत में ही मंदिर में चूने (टपकने)लगा पानी : मुख्य पुजारी राम मंदिर pic.twitter.com/PNTfYnJHDr