ఉద్యోగాలు ఇప్పిస్తానని.. 5 లక్షలు టోకరా

ఉద్యోగాలు ఇప్పిస్తానని.. 5 లక్షలు టోకరా

రామచంద్రాపురం, వెలుగు : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేశారు.  బుధవారం  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగి సత్యసీల్ ​బీహెచ్‌ఈఎల్‌  పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తానని  ఫేక్​ డాక్యుమెంట్లు చూపిస్తూ  ఏడుగురి వద్ద రూ. 5 .40  లక్షలు వసూలు చేశాడు.   విషయం గుర్తించిన మల్లన్న గారి విఠల్​ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.