ఎన్టీపీసీలో వంద మెగావాట్ల సోలార్ పవర్..గ్రిడ్కు లింక్ చేసిన అధికారులు

ఎన్టీపీసీలో వంద మెగావాట్ల సోలార్ పవర్..గ్రిడ్కు లింక్ చేసిన అధికారులు
  • మరో 76 మెగావాట్ల ఉత్పత్తికి సన్నాహాలు

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎన్టీపీసీలో వంద మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత విద్యుత్‌‌‌‌ను గ్రిడ్‌‌‌‌కు అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. రామగుండం ఎన్టీపీసీలో మొత్తం 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో ప్రస్తుతం వంద మెగావాట్ల వరకు ఫొటో వోల్టాయిక్ పద్ధతిలో విద్యుత్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్‌‌‌‌లో మొత్తం 176 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ఈ నెల 10న న్యూఢిల్లీలోజరిగే కార్యక్రమంలోఈ ప్లాంట్‌‌‌‌ను ప్రధాని వర్చువల్‌‌‌‌గా  ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా రామగుండం ఎన్టీపీసీలో ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్ పవర్, ఎన్టీపీసీ రిజర్వాయర్‌‌‌‌పై 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ఉత్పత్తి కొనసాగుతోంది. థర్మల్ విద్యుత్‌‌‌‌కు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్‌‌‌‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తి ఉత్పత్తిపై దృష్టి సారించగా,ఆ దిశగాచర్యలు కొనసాగుతున్నాయి.