- బహిరంగ మద్యంపానంపై నిషేధం
- రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వీధుల్లో తిరుగుతూ అసభ్య పదజాలంతో మాట్లాడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ నిషేధాజ్ఞలు డిసెంబర్ ఒకటి వరకు కొనసాగుతాయని తెలిపారు.
నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే డీజే, డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడి గించించామని తెలిపారు. వివిధ కార్యక్రమాల సందర్బంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే, మైక్ సెట్ వినియోగం కోసం సంబంధిత డివిజన్ ఏసీపీల అనుమతి పొందాలని సూచించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం అమలులో వుంటుందన్నారు.ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు.
