పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఆర్మీ జవాను 

పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఆర్మీ జవాను 

ప్రేమించి మోసం చేశాడంటూ ఓ ఆర్మీజవానుపై వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. దాదాపూర్ కు చెందిన జవాన్ రామకృష్ణ... ఐనాపూర్ కు చెందిన మమత మధ్య ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ తో మొదలైన వీరి పరిచయం ప్రేమ, పెళ్లి వరకు వచ్చింది. వారం రోజలు సెలవులపై వచ్చిన ఆర్మీ జవాన్ యువతిని బయటకు తీసుకెళ్లి  పెళ్లిచేసుకుంటానని చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి అతగాడు మాట మార్చేశాడు. నిన్న రాత్రి రామకృష్ణ యువతిపై అత్యాచారయత్నం చేస్తుండగా యువతి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. తనను ఏమీ చేయొద్దని..యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇవాళ ఉదయం అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లిచేసుకోవాలని రామకృష్ణను అడిగితే ప్లేట్ ఫిరాయించాడు. తాను పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. తనను ప్రేమించి  మోసం చేసిన రామకృష్ణతో పెళ్లి చేయాలని  కోరుతోంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.