
కోల్‌కతా/న్యూఢిల్లీ: కాళీమాత ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నా రు. మన దేశం ఆధ్యాత్మిక శక్తితో లోక కల్యాణం కోసం ముందుకు సాగుతోందని చెప్పారు. ‘‘కాళీమాత దర్శనం పొందిన సాధువులలో రామకృష్ణ పరమహంస ఒకరు. ఆయన తన సర్వస్వాన్ని దేవికి సమర్పించుకున్నారు. దేవి శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉందని ఆయన చెబుతుండేవారు. బెంగాల్‌తో పాటు దేశమంతా ఈ చైతన్యం కనిపిస్తుంది” అని తెలిపారు. ‘‘కాళీ” డాక్యుమెంటరీ పోస్టర్ వివాదం నేపథ్యంలో మోడీ ఈ కామెంట్లు చేశారు. ఆదివారం బెంగాల్ కోల్ కతాలోని రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్వామి ఆత్మాస్థానంద శత జయంతి వేడుకలు నిర్వహించగా, ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్యులు, స్వామి వివేకానందను గుర్తు చేశారు.
నేచురల్ ఫార్మింగ్ సక్సెస్ అయితది..
రాబోయే రోజుల్లో నేచురల్ ఫార్మింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందని మోడీ అన్నారు. రైతులు ఎంత తొందరగా నేచురల్ ఫార్మింగ్‌కు మారితే, అంత ఎక్కువ లాభాలు పొందుతారని చెప్పారు. గుజరాత్ లోని సూరత్‌లో జరిగిన నేచురల్ ఫార్మింగ్ కాన్ క్లేవ్లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
Tributes to Swami Atmasthananda Ji on his birth centenary. https://t.co/EKKExOGbll
— Narendra Modi (@narendramodi) July 10, 2022