ఎమ్మెల్యే ఇంట్లో లక్కీ డిప్ ఎలా తీస్తారు?

ఎమ్మెల్యే ఇంట్లో లక్కీ డిప్  ఎలా తీస్తారు?

గద్వాల, వెలుగు: బీఆర్ఎస్  పార్టీకి చేనేత, జౌళి శాఖ ఏడీ గోవిందయ్య ఏజెంట్ లా వ్యవహరిస్తున్నాడని, ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్ లో లక్కీ డిప్​ ఎలా నిర్వహిస్తారని చేనేత సెల్  జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, స్వకులశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామలింగేశ్వర కాంబ్లే, బీజేపీ లీడర్లు ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చేనేత అభివృద్ధి పథకం క్లస్టర్  స్కీమ్​లో లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్  ఆధ్వర్యంలో చేపట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

264 మంది చేనేత కార్మికులు ఉండగా, 135 మంది పేర్లను మాత్రమే ఎలా చేర్చారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల సందర్భంగా గద్వాలకు వచ్చిన మంత్రి కేటీఆర్  చేనేత పార్కుకు రూ.14 కోట్లు రిలీజ్  చేస్తానని చెప్పి ఇప్పటి వరకు మంజూరు చేయలేదన్నారు. ఎమ్మెల్యే  క్యాంప్​ ఆఫీసులో తీసిన లక్కీ డిప్ ను రద్దు చేసి, ఏడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండల వెంకట్రాములు, కుమ్మరి శీను, నాగేందర్ యాదవ్, చిత్తారి కిరణ్  పాల్గొన్నారు.