సూర్య వశిష్ట, దీప్షిక జంటగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘రమణి కళ్యాణం’. విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. ‘కోర్ట్’ ఫేమ్ రామ్ జగదీష్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. మంగళవారం ఈ మూవీ టీజర్‌ను నటి జయసుధ లాంచ్ చేసి.. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా సూర్య వశిష్ట మాట్లాడుతూ ‘ఈ టైటిల్‌లోనే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి.
ఇందులో చాలెంజింగ్ రోల్ చేశా. వీల్ చైర్‌లో కూర్చుని ఎటూ కదలకుండా నటించడం సవాల్‌గా అనిపించింది. ఇదొక క్లీన్ ఫ్యామిలీ మూవీ’ అని అన్నాడు. ఈ చిత్రంలో చూపులేని అమ్మాయిగా కనిపిస్తానని హీరోయిన్ దీప్షిక చంద్రన్ చెప్పింది. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే సినిమా ఇదని డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి అన్నాడు. నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. అందరూ మెచ్చేలా ఉంటుంది’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
