
ముచ్చింతల్లోని చినజీయర్ ఆశ్రమం శ్రీరామనగరంలో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు వేడుకలలో భాగంగా..
పెరుమాళ్ళ విగ్రహ మూర్తులను అశ్వవాహనంపై పుర వీధుల్లో ఊరేగిస్తూ.. యాగశాలకు తీసుకొచ్చారు. నేటి కార్యక్రమంలో 5 వేల వేద పండితులతో ఋత్విక్ వర్ణన, వాస్తుపూజ, సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. మొదటి రోజు కార్యక్రమంలో వివిధ పీఠాలకు చెందిన ఏడుగురు జీయర్ స్వాములు పాల్గొన్నారు.
నేటి నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల కోసం 7 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఈ వేడుకలలో ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోడీ, 7న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర వీఐపీలు పాల్గొంటారని చెప్పారు.
For More News..
జాతీయ రహదారిపై దర్జాగా రోడ్డు దాటుతున్న పులి
‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్
గుస్సాడీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్