రామాయణం టైటిల్ గ్లింప్స్.. రాముడిగా రణ్ బీర్,రావణుడిగా యశ్

రామాయణం టైటిల్ గ్లింప్స్.. రాముడిగా రణ్ బీర్,రావణుడిగా యశ్

బాలీవుడ్ హీరో  రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘రామాయణం’. సీతగా సాయి పల్లవిగా నటిస్తుండగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.   ‘ది ఇంట్రడక్షన్’ పేరుతో గురువారం ఈ మూవీ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో రాముడిగా రణబీర్,  రావణుడిగా యశ్ లుక్ ఆకట్టుకున్నాయి. ఇందులోని విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.  

‘కాలం ఉనికిలో ఉన్నప్పటి నుంచి త్రిముూర్తులు ముల్లోకాలను పరిపాలిస్తున్నారు. బ్రహ్మ.. సృష్టించే దేవుడు, విష్ణువు.. రక్షించే దేవుడు, శివుడు.. అంతం చేయగలిగే దేవుడు.. కానీ వారి సృష్టి మూడు లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురుతిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది. 5000 సంవత్సరాల నుంచి 2500 కోట్ల మంది ప్రజలచే ఆరాధించబడుతున్నది.

ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ.. రామ వర్సెస్  రావణ.  అధికారం, ప్రతీకారానికి ప్రతిరూపంగా రావణుడిని... ధర్మం, త్యాగానికి నిర్వచనంగా రాముడి పాత్రను పరిచయం చేసిన తీరు సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.  లక్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్‌‌‌‌‌‌‌‌ ఇందులో కనిపించనున్నట్టు రివీల్  చేశారు.

ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన మ్యూజిక్ అంచనాలు పెంచుతోంది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి, సెకండ్ పార్ట్‌‌‌‌‌‌‌‌ను 2027 దీపావళికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.