అమెరికా టాక్ షో లో రామ్ చరణ్

అమెరికా టాక్ షో లో రామ్ చరణ్

అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన టాక్ షో  గుడ్ మార్నింగ్ అమెరికా3 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. గ్రే బ్లేజర్, మ్యాచింగ్ ట్రౌజర్ తో  చాలా స్టైలిష్ గా కనిపించాడు చెర్రీ. బ్రౌన్ షూస్..సన్ గ్లాసెస్ తో ఫుల్ స్మార్ట్ లుక్ లో అదిరిపోయాడు. ఈ షోలో  రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ, డైరెక్టర్ రాజమౌళి, తారక్ తో తనకున్న  ఫ్రెండ్ షిప్  గురించి చెప్పాడు. అలాగే ఆస్కార్ నామినేట్ అయిన నాటునాటు సాంగ్ గురించి ప్రస్తావించాడు.

ఈ షోలో పాల్గొనడానికి ముందు న్యూ యార్క్ కు చేరుకున్న రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. అభిమానులు రామ్ చరణ్ ను చుట్టుముట్టారు. దీంతో రామ్ చరణ్ అభిమానుల దగ్గరకు వెళ్లి  వారిని  పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.  వారితో కలిసి ఒక  సెల్ఫీ తీసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్‌‌‌‌ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌‌‌‌ లో పాల్గొనడానికి రామ్ చరణ్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.