
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తన తెరంగేట్రం ఖరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా రెడీ చేసినట్టు సమాచారం. ఈ చితాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించనున్నారట.
మహేష్ బాబు కూడా ‘రాజ కుమారుడు’చిత్రంతో ఈ బ్యానర్ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ సెంటిమెంట్ దిశగా ఈ సినిమా నిర్మాణం సాగనుందని ప్రచారం జరుగుతోంది. జయ కృష్ణ తొలి చిత్రాన్ని బాబాయ్ మహేష్ బాబే దగ్గర ఉండి పర్యవేక్షించబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది.
కృష్ణ కుటుంబం నుంచి జయకృష్ణ మూడో తరం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడతాయి. రమేష్ బాబు పలు సినిమాల్లో హీరోగా నటించి.. ఆ తర్వాత నిర్మాతగానూ రాణించారు. మూడేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమారుడు జయకృష్ణ సినీ రంగ ప్రవేశం ఘట్టమనేని అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంది.
Exciting things are coming! Ready to make his mark on Stay tuned. - Jaya Krishna Ghattamaneni
— Jaya Krishna Ghattamaneni (@JKGhatPM) July 20, 2024
#JayaKrishnaGhattamaneni #JK #Tollywood #SSMB #SSMB29 #MaheshBabu @SSMBSpace @OkkadiFanIkada @SSMBTrendsTeam @ssmb_Beatz @BangaloreMBFC pic.twitter.com/zRdDQrHpEy