రాంపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ

రాంపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ

లక్నో: సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజం ఖాన్​పై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే పదవికి ఆయనను అనర్హుడిగా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌లపై 2019లో  విద్వేషపూరిత కామెంట్లు చేసిన కేసులో గురువారం ఆజం ఖాన్​కు మూడేండ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వంటి ప్రజాప్రతినిధులు క్రిమినల్ కేసులో దోషిగా తేలి, రెండేళ్ల జైలు శిక్ష పడితే తమ పదవిని వెంటనే కోల్పోతారు. ఆజంఖాన్​కు మూడేళ్ల శిక్ష పడడంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ స్పీకర్​కు ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. ఈసీ సిఫారసుతో ఆజంఖాన్​ ను స్పీకర్​ అనర్హుడిగా తేల్చి, రాంపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు.