దసరా కానుకగా ప్యాన్ ఇండియా బాషలలో రజనీకాంత్ హీరోగా నటించిన వేట్టయన్ చిత్రం అక్టోబర్ 10 న విడుదల కాబోతోంది. దీంతో ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు వేట్టయన్ చిత్ర విడుదల సదర్భంగా అక్టోబర్ 10 న సెలవులు కూడా ప్రకటించారు.
అయితే ఈ చిత్రంలో నటించిన తెలుగు ప్రముఖ స్టార్ హీరో రాణా దగ్గుబాటి మరియు టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తదితరులు ఈరోజు (అక్టోబర్ 9) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా హీరో రాణా దగ్గుబాటి మాట్లాడుతూ సినిమాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ALSO READ | లేడీ యాక్షన్ థ్రిల్లర్ లో ఛాన్స్ కొట్టేసిన మలయాళ బ్యూటీ... గ్రాండ్ గా లాంచ్.
ఇప్పటివరకూ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్ని చిత్రాల్లో కంటే వేట్టయన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోందని అన్నారు. అలాగే సినిమా అనే దానికి భాష లేదు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలని అన్ని బాషల ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపాడు. ఇక వేట్టయన్ సినిమాలో తనతోపాటూ ఫాహద్ ఫజిల్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్ తదితరులు నటించారని కచ్చితంగా మీకు నచ్చుతుందని థియేటర్ కి వెళ్ళి చూడాలని ఆడియన్స్ ని కోరాడు. రజిననీకాంత్ లాంటి గొప్ప నటుడితో కలసి నటించడం నిజంగా తన అదృష్టం అని అన్నాడు.
ఈ విషయం ఇలా ఉండగా రాణా దగ్గుబాటి ఆమధ్య నటించిన విరాట పర్వం, 1945 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దీంతో తన నెక్ట్స్ సినిమాల కథలపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు.