తలైవాకు  విలన్‌‌గా..

తలైవాకు  విలన్‌‌గా..

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వెట్టయాన్‌‌’. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘జై భీమ్‌‌’తో మెప్పించిన టీజే జ్ఞానవేల్‌‌ దీనికి దర్శకుడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తన గత చిత్రం తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్‌‌కు దగ్గరగా, సందేశం ఉంటూనే కమర్షియల్‌‌ ఎలిమెంట్స్‌‌ ఉండేలా జ్ఞానవేల్‌‌ దీన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇందులో మెయిన్‌‌ విలన్‌‌గా రానా నటిస్తున్నట్టు తెలుస్తోంది. టెక్నాలజీపై పట్టున్న స్టైలిష్‌‌ విలన్‌‌ పాత్రలో రానా కనిపించబోతున్నాడట. రజినీకాంత్‌‌ క్యారెక్టర్‌‌‌‌తో పాటు రానా పాత్ర కూడా సినిమాకు హైలైట్‌‌గా నిలవనుందని టాక్. బాహుబలి, భీమ్లా శంకర్ చిత్రాల తర్వాత మరోసారి నెగిటివ్‌‌ షేడ్స్ ఉండే పాత్రలో రానాను చూడబోతున్నాం. విద్యా వ్యవస్థలోని అవినీతి  నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అక్టోబర్‌‌‌‌లో సినిమా విడుదల కానుంది.