Ranbir Kapoor: కూతురి కోసం రణ్బీర్ ఖరీదైన గిఫ్ట్.. ఇండియాస్ రిచెస్ట్ కిడ్ రాహా కపూర్!

Ranbir Kapoor: కూతురి కోసం రణ్బీర్ ఖరీదైన గిఫ్ట్.. ఇండియాస్ రిచెస్ట్ కిడ్ రాహా కపూర్!

సావరియా(Sawariya) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సీనియర్ స్టార్ హీరో రిషి కపూర్ కుమారుడు రణ్బీర్ కపూర్(Ranbir kapoor). ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్స్ అందుకొని.. బాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఇక ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal) ఎంత పెద్ద సక్సెస్ సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.900 కోట్లు వసూళ్లు చేసింది. ఫాథర్ అండ్ సన్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. 

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్స్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఇప్పుడు ఒక పాప కూడా. ఆ పాపకి రాహా కపూర్ అని పేరు పెట్టుకున్నారు ఈ జంట. ఆ పాపకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. కూతురు రాహా కపూర్ కోసం కోట్ల విలువైన బంగ్లాని గిఫ్ట్ గా ఇవ్వనున్నాడట రణ్బీర్. 

ఇటీవల రణ్బీర్ కపూర్, ఆలియా భట్, నీతూ కపూర్ కలిసి ముంబై బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కనిపించారు. దాదాపుగా రూ.250 కోట్ల విలువగల ఈ బంగ్లాను కూతురు రాహా కపూర్ పేరు మీద నిర్మిస్తున్నాడట రణ్బీర్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్.. ఇండియాస్ రిచెస్ట్ కిడ్ రాహా కపూర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.