యానిమల్ మూవీ అద్భుతం.. భర్తపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

యానిమల్ మూవీ అద్భుతం.. భర్తపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఇండియా మొత్తం యానిమల్(Animal) ఫీవర్ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) తెరకెక్కించిన ఈ వైలెంట్ మూవీకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటిరోజే ఏకంగా రూ.115 కోట్ల గ్రాస్ రాబట్టి రణ్బీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ వీకెండ్ కాళ్ళా బ్రేకీన్ సాధించి మేకర్స్ కు సూపర్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టనుంది. 

ఇక యానిమల్ సినిమా చుసిన సినీ స్టార్ కూడా టీమ్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. అందులో రణ్బీర్ కపూర్ భార్య ఆలియా భట్ కూడా ఉన్నారు. రిలీజ్ రోజే యానిమల్ సినిమా చూసిన ఆమె.. సినిమా గురించి, భర్త రణ్బీర్ గురించి, రష్మిక గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. సందీప్ రెడ్డి వంగా మీలా ఎవరు చేయలేరు. సినిమాలో బీట్స్ షాకింగ్‌ గా ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. కొన్ని సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. రష్మిక మీరు మీ నటనతో అంజలి పాత్రకు ప్రాణం పోశారు. ఇక నా భర్తతో నటించిన ప్రతీ సీన్స్ లో మీ ప్రేమలో పడిపోయాను.. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆలియా భట్. ప్రస్తుతం ఆలియా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.