
- చంపి బాగా ఫేమస్ అవుతానని ప్రకటన
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంబజర్ల గ్రామంలో అక్కను తమ్ముడు హత్య చేసిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన రుచిత(21)ను సోమవారం తమ్ముడు రోహిత్ హత్య చేసిన విషయం తెలిసిందే. తన సోదరి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో తరచూ మాట్లాడుతుండడంతో రోహిత్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే పోలీసుల విచారణలో మరో కొత్త విషయం బయటికి వచ్చింది. నిందితుడు రోహిత్ హత్య ఘటనకు ముందు ఇన్స్టాలో ఓ రీల్ చేసినట్లు గుర్తించారు.
ఆ రీల్లో ‘బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా’ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పథకం ప్రకారమే యువకుడు తన సోదరిని హతమార్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.