ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో ఘోరం.. ఒకరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో ఘోరం.. ఒకరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడ మున్సిపాలిటీ ఫాబ్ సిటీలోని ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దాని కింద పనిచేస్తున్న కార్మికులపై ఆ స్లాబ్ పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కంపెనీ యాజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.