నీళ్లు లేకుండా ఎలా బ్రతకాలి.. సమస్యలు తీరిస్తేనే మా గ్రామానికి రండీ లేదంటే..

నీళ్లు లేకుండా ఎలా బ్రతకాలి.. సమస్యలు తీరిస్తేనే మా గ్రామానికి రండీ లేదంటే..

తమ గ్రామంలో తాగునీళ్లు రావడం లేదని.. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు రోడ్డెక్కారు. సర్పంచ్ డౌన్ డౌన్, నీళ్లు కావాలి  అంటూ నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా వెలిజర్ల గ్రామపంచాయతీలోని ఎన్నగడ్డ తండా, తోక రేగడి తండాల వాసులు తాగునీటి కోసం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. వెలిజర్ల ప్రధాన రహదారిపై ముళ్లపొదలను పెట్టి.. మా గ్రామంలోకి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవ్వరూ రావద్దంటూ ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జాం అయింది. 

ALSO READ : మా కాలనీల్లోకి రావద్దు.. ఖమ్మంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

ఎన్నికల సమయంలో ఓట్లు ఓట్ల కోసం మాత్రమే తమ గ్రామాలకు వస్తారే కానీ.. తమ గ్రామంలో ఉన్న సమస్యలను మాత్రం తీర్చడానికి ఎవరూ ముందుకు రారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేకుండా ఎలా బ్రతకాలని స్థానిక అధికారులను నిలదీశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.