‘నాటు నాటు’ పాట పాడిన బాలీవుడ్ సూపర్ స్టార్

‘నాటు నాటు’ పాట పాడిన బాలీవుడ్ సూపర్ స్టార్

అబుదాబి: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. రిలీజైన మూడ్రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్ ఈ మూవీ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా హాలీవుడ్ మూవీలను మించిపోయిందన్నాడు. 

‘మనం సృజనాత్మక కథలు చెప్పాల్సిన తరుణమిది. భారతీయ కథల్ని ప్రపంచానికి అందించాలి. మన సినిమాలను దునియాలోని అందరికీ చేరువయ్యేలా చేయడం ఇప్పుడు సులువుగా మారింది. ఈ దిశగా ఓటీటీ కూడా ఉపయోగపడుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీని తీసుకుంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ చిత్రాలను బీట్ చేస్తోంది. ఇది మనందరికీ గర్వకారణం’ అని రణ్ వీర్ పేర్కొన్నారు. అనంతరం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాపులర్ సాంగ్ ‘నాటు నాటు’ను ఆయన పాడి వినిపించారు. ఎస్ఎస్ రాజమౌళి కథల్ని చెప్పే విధానాన్ని రణ్ వీర్ మెచ్చుకున్నారు. దుబాయ్ లో నిర్వహించిన ‘ఇండియా ఎక్స్ పో’లో పాల్గొన్న రణ్ వీర్ పైవ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. భారత్ కథలకు నెలవని.. స్టోరీ హబ్ గా మనం మరింతగా ఎదగాలని కోరుకుంటున్నట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం:

మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ

ఇక కరోనా కాలర్ ట్యూన్‌కు గుడ్ బై?

జెలెన్స్కీని వదలను.. పుతిన్ వార్నింగ్