
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఏ పాత్రనైనా పోషించే సత్తా ఉన్నవారిలో ఒకడిగా రణ్‌వీర్ సింగ్కు మంచి పేరుంది. ‘పద్మావతి’, ‘గల్లీ బాయ్స్’ చిత్రాల్లో నటనతో తానేంటో నిరూపించుకున్న రణ్‌వీర్.. ఈసారి మరో భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. ‘జయేష్ భాయ్ జోర్దార్’ చిత్రంతో మరోసారి తనలోని విలక్షణతను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. పితృస్వామ్య వ్యవస్థకు ఎదురు తిరిగే వ్యక్తిగా ఇందులో రణ్‌వీర్ కనిపిస్తున్నాడు. వారసుడు కావాల్సిందేనని పట్టుబట్టే కుటుంబం నుంచి తన భార్య, కుమార్తెలను కాపాడేందుకు ప్రయత్నించే ఓ సాధారణ గుజరాతీ భర్త పాత్రలో రణ్‌వీర్ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాలు పెంచుతోంది. వంశానికి వారసుడు కావాల్సిందేనంటూ తన కొడుకు జయేష్ (రణ్ వీర్)ను ఇబ్బంది పెట్టే తండ్రి పాత్రలో సీనియర్ నటుడు బొమన్ ఇరానీ యాక్ట్ చేస్తున్నాడు. జయేష్ భార్య పాత్రలో ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే నటిస్తోంది.
బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘జయేశ్ భాయ్’ చిత్రం.. మే 13న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. దివ్యాంగ్ ఠాకూర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘జయేశ్ భాయ్’ సినిమాను పక్కనబెడితే.. యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి డైరెక్షన్ లో ‘సర్కస్’, కరణ్ జోహర్ దర్శకత్వంలో ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమాలో రణ్‌వీర్ నటిస్తున్నాడు. ‘రాకీ ఔర్ రాణీ’లో ఆయన సరసన ఆలియా భట్ నటిస్తోంది.
మరిన్ని వార్తల కోసం..