బీఆర్ఎస్​లోకి రావుల చంద్రశేఖర్ రెడ్డి!

బీఆర్ఎస్​లోకి రావుల చంద్రశేఖర్ రెడ్డి!
  • అమావాస్య తర్వాత కేసీఆర్​ సమక్షంలో చేరిక

హైదరాబాద్, వెలుగు: టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్​రెడ్డి బీఆర్ఎస్​లో చేరనున్నారు. అమావాస్య తర్వాత కేసీఆర్​సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారని బీఆర్ఎస్​వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాకు చెందిన రావుల.. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్నారు. వనపర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యసభ సభ్యుడిగా ఆరేండ్లు పని చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి తెలంగాణ రాజకీయావకాశాలు తగ్గినా పార్టీతోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్​లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్​ జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు.


ALSO READ: అయోమయంలో ప్రతిపక్షాలు..షెడ్యూల్ వచ్చినా ఖరారు కానీ క్యాండిడేట్స్

ఆయన త్వరలోనే ఎమ్మెల్సీకి రాజీనామా చేయనున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహబూబ్​నగర్​స్థానిక సంస్థల స్థానం నుంచి రావులను పోటీ చేయిస్తామని గులాబీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.