స్నానాల గుండంలో అరుదైన నాణేలు

స్నానాల గుండంలో అరుదైన నాణేలు

నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో దాదాపు 150 ఏండ్ల నాటి నాణేలు దొరికాయి. గ్రామానికి కొద్ది దూరంలో పెద్ద గుట్టపై 150 ఏండ్ల కింద సురభి రాజ వంశస్తులు వేణుగోపాల్ స్వామి, సత్యనారాయణ స్వామి ఆలయాలు, సీతమ్మ పేరిట స్నానాల గుండం నిర్మించారు.  ఈ గుట్టను నిచ్చెనకొండగా పిలుస్తుంటారు. అభివృద్ధిలో భాగంగా స్నానాల గుండంలో పూడిక తీస్తుండగా, గురువారం పురాతన కాలం నాటి నాణేలు లభ్యమయ్యాయి. బొట్టు నాణెం నుంచి ఇప్పటి నాణేల వరకు దొరికినట్లు తెలిపారు.