వైరల్ పోస్ట్: పసుపురంగు తాబేలును ఎప్పుడైనా చూశారా?

వైరల్ పోస్ట్: పసుపురంగు తాబేలును ఎప్పుడైనా చూశారా?

తాబేలు ఏ రంగులో ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ, పసుపు పచ్చ రంగులో ఉండే అరుదైన తాబేలును మీరెప్పుడైనా చూశారా? చూడలేదా.. అయితే ఆ తాబేలును ఇప్పుడు చూడండి. చూడడానికి విచిత్రంగా పసుపు రంగులో ఉన్న ఈ తాబేలు.. పశ్చిమ బెంగాల్‌లోని బుర్డ్వాన్ చెరువులో లభించింది. దీనిని అక్టోబర్ 27న చెరువు నుంచి కాపాడారు. ఈ అరుదైన ఫ్లాప్‌షెల్ తాబేలుకు జన్యు పరమైన లోపాల వల్ల ఈ రంగు వచ్చినట్లు తెలుస్తోంది. తాబేలు శరీరంలో టైరోసిన్ వర్ణద్రవ్యం లేకపోవడం వల్ల పుట్టుకతో ఈ రుగ్మత వచ్చినట్లు సమాచారం.

ఈ అరుదైన తాబేలు ఫొటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన దేబాషిష్ శర్మ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లోని ఒక చెరువు నుంచి పసుపు రంగు తాబేలు రక్షించబడింది. ఇది చాలా అరుదుగా కనిపించే ఫ్లాప్‌షెల్ తాబేలు. ఇది ఒక అల్బినో రకం. దీని విచిత్రమైన పసుపు రంగు కొన్ని జన్యుపరమైన లోపాల వల్ల పుట్టుకతో వచ్చే రుగ్మత కావచ్చు. టైరోసిన్ వర్ణద్రవ్యం లోపం వల్ల ఇలా జరుగుతుంది’ అని దేబాషిష్ శర్మ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ తాబేలును చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

For More News..

తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు

సరుకులు తీసుకొని బిల్ కౌంటర్‌కు వెళ్లకుండా ఇంటికెళ్లొచ్చు

చేతికందే టైంలో మాడుతున్న వరిపంట.. నిండా ముంచిన దోమపోటు