ఫ్రూట్ ఐస్ తో చర్మంపై దద్దుర్లు, కంటికింద నలుపు మాయం

ఫ్రూట్ ఐస్ తో చర్మంపై దద్దుర్లు, కంటికింద నలుపు మాయం

అందానికి ఐస్ క్యూబ్స్ మంత్రంలా పని చేస్తాయి అంటోంది ఫేమస్ న్యూట్రిషనిస్ట్ శ్వేత షా. అందులోనూ సంత్రా ఐస్ క్యూబ్స్ అయితే ఇంకా బెటర్ అంట. ఈ సంతా ఐస్ క్యూబ్స్ ఎలా తయారుచేసుకోవాలంటే..

బొప్పాయి గుజ్జుని ఫ్రిజ్ ఐస్ బొ ట్టేలలో వేసి, గడ్డ కట్టించాలి. తర్వాత సంత్రా పండుని గుండ్రంగా తరగాలి. బంతిపువ్వు రెక్కలని కడిగి పక్కన పెట్టాలి. ఇప్పుడు రెండు బొప్పాయిక్యూబ్స్ ని, బంతిపువ్వు రెక్కలని, సంత్రా ముక్కలని మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. ఆ గుజ్జుని ఐస్ క్యూబ్ ట్రేలో వేసి, సంత్రా ఐస్ క్యూబ్స్ తయారుచేయాలి. వాటితో రోజుకి రెండు సార్లు ముఖాన్ని మసాజ్ చేయాలి. సెన్సిటివ్ స్కిన్ ఉంటే.. ఐస్ క్యూబ్స్ ని పలుచటి బట్టలో చుట్టి, ముఖాన్ని రుద్దాలి.

లాభాలెన్నో

సంత్రాలోని విటమిన్ -సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయిలోని పపైన్ నేచురల్ - డీటానింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. బంతిపువ్వులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలు తగ్గిస్తాయి.ఈ సంత్రా ఐస్ క్యూబ్ కంటికింద నలుపుని తగ్గిస్తుంది. చర్మంపై దద్దుర్లని పోగొడుతుంది. ఐస్ క్యూబ్స్ ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా మెరుస్తుంది.