అక్కా చెల్లెల్లలా కాజల్, రాశీఖ‌న్నా.. వైరల్ అవుతున్న ఫోటో

అక్కా చెల్లెల్లలా కాజల్, రాశీఖ‌న్నా.. వైరల్ అవుతున్న ఫోటో

బ్యూటీ క్వీన్ లు  రాశీఖ‌న్నా(Rashi khanna), కాజ‌ల్ అగ‌ర్వాల్(Kajal Agarwal) ఒకే చోట క‌లిస్తే  లేడీ ఫ్యాన్స్ కు  ఆ కిక్కే వేరు. హీరోయిన్లు రాశీఖ‌న్నా, కాజ‌ల్ క్యాజువల్ గా కలిసి సెల్పీలు దిగారు. వీరికి కాజ‌ల్ గారాల కొడుకు  కూడా తోడ‌య్యాడు. ఇద్దరూ  అక్కా-చెల్లిలా చాలా క్లోజ్ గా పిక్ లో కనిపించారు. ఒక‌రిపై ఒక‌రు వాలిపోయి మ‌రీ ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇద్దరు హీరోయిన్ల ఫ్యాన్స్ అక్కా చెల్లెల్లలా ఉన్నారని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

కెరీర్ ప‌రంగా చూస్తే ఇద్దరూ బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతూ తెలుగు లో మంచి అవ‌కాశాలు అందుకుంటోంది. సీనియ‌ర్ హీరోల‌కు పర్ఫెక్ట్ చాయిస్ గా నిలుస్తోంది. బాలయ్యతో కాజల్   న‌టించిన భ‌గంవ‌త్ కేస‌రి త్వరలో రిలీజ్ అవనుంది. మరోపక్క స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో  `ఇండియ‌న్ -2`లోనూ కాజల్  న‌టిస్తుంది. ఇక రాశీఖన్నా తనదైన స్టైల్ లో   చిన్నా పెద్ద అందరూ హీరోలతో సినిమాలు చేస్తోంది.