
బుల్లితెర యాంకర్, నటి రష్మీ గౌతమ్ మరో వివాదంలో చిక్కుకుంది. స్వతహాగా జంతు ప్రేమికురాలైన ఆమె.. కొన్ని సందర్భాల్లో చేసే పోస్టులు కాంట్రవర్సీగా మారుతుంటాయి. నిన్న బక్రీద్ కావడంతో ఆమె ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. అందులో పండుగల పేరుతో చేసే జంతు బలులును ప్రశ్నించింది.
దీనిపై ఇప్పటికైనా ఆలోచించుకోవాలంటూ హితవు పలికింది. దీంతో రష్మీపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీకు పండగలప్పుడే జంతువులపై ప్రేమ పుట్టుకొస్తుందా? అంటూ స్పందిస్తున్నారు. కొన్ని బడా కంపెనీలు జంతు మాంసాన్ని ఓ బ్రాండ్‌గా మార్చి అమ్ముతున్నాయి. మరి వాటిపై ఎందుకు మాట్లాడటం లేదు. ఇవన్నీ కేవలం ఫేమస్ అయ్యేందుకు చేస్తున్నావంటూ ఆమెపై మండిపడుతున్నారు.