
తెలుగు బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautham) పెళ్లి విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, ఒరిస్సాకు చెందిన ఒక బడా వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి జరుగనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు విని సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) ఫ్యాన్స్ షాకవుతున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రష్మీ గౌతమ్ పెళ్లి విషయంపై గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో రష్మీ కుటుంబసభ్యులు ఆ రూమర్స్ కు చెక్ పట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే రష్మీకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారట. రష్మీ సొంతూరు ఒరిస్సా కు చెందిన బడా వ్యారవేత్తతో ఆమె పెళ్లి ఫిక్స్ చేశారట. ఈ విషయంలో ఇరు కుటంబాల నుండి అంగీకారం కూడా వచ్చిందట. దీంతో త్వరలోనే ఈ పెళ్లిపై అధికారిక ప్రక్కన రానుందని తెలుస్తోంది. ఈ వార్త తెలుసుకున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. నీదారి నువ్వు చూసుకుంటే మా అన్న ఎం కావలి రష్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి రష్మీ, సుధీర్ ఎప్పుడు తమకు ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందని చెప్పలేదు. మేమిద్దరం కలిసి చేసినవన్నీ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే అని, అందులో ఎలాంటి నిజం లేదని చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ.. ఈ ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావించారు. అందుకే రష్మీ పెళ్లి వార్తలతో కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరి రష్మీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.