హైదరాబాద్, వెలుగు: ఐటీఎఫ్ విమెన్స్ వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాదీ శ్రీవల్లి రష్మిక విమెన్స్ సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇండోర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ రష్మిక 3–6, 2–6తో రెండో సీడ్ డలైలా జకుపొవిచ్ (స్లోవేనియా) చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌లో వైదేహి చౌదరితో కలిసి రష్మిక టైటిల్ నెగ్గింది.
