డిసెంబర్ 1 నుంచి రాష్ట్రపతి భవన్ ఓపెన్‌‌

డిసెంబర్ 1 నుంచి రాష్ట్రపతి భవన్ ఓపెన్‌‌
  • వారంలో 5 రోజులు సందర్శకులకు అనుమతి 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి భవన్‌‌లోకి సందర్శకులను డిసెంబర్ 1 నుంచి అనుమతించనున్నారు. వారంలో 5 రోజులు, ఐదు స్లాట్లుగా సందర్శకులకు అవకాశం కల్పించనున్నట్లు సోమవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 10–11, 11–12, 12–1 గంటల వరకు, మధ్యాహ్నం 2–3, 3–4 గంటల వారిగా స్లాట్లు ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రపతి మ్యూజియం కాంప్లెక్స్ మాత్రం వారంలో ఆరు రోజులు(మంగళవారం నుంచి ఆదివారం) తెరిచి ఉంటుందని తెలిపింది.

ప్రతి శనివారం ఉదయం 8–9కు చేంజ్ ఆఫ్ గార్డ్ సెర్మనీ వీక్షించవచ్చని వెల్లడించింది. అయితే, పబ్లిక్ హాలీడేస్‌‌లలో మాత్రం భవన్‌‌లోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది.