మిగిలిన లాంగ్వేజీ పండిట్లను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయాలి .. ప్రభుత్వానికి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూపీపీ వినతి

మిగిలిన లాంగ్వేజీ పండిట్లను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయాలి .. ప్రభుత్వానికి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూపీపీ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిగిలిన భాషా పండితులందరినీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్(ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూపీపీ) అధ్యక్షుడు శానమోని నర్సింలు కోరారు. మంగళవారం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూపీపీ నేతలు సెక్రటేరియెట్ లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరికి వినతిపత్రం ఇచ్చారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం నుంచి స్కూల్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వరకు బదిలీలతో కూడిన పదోన్నతులు ఇవ్వాలని, యాక్ట్ 1/2005 రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ఎంఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి యాదవ్, అమీర్ పాషా, మానుపురి వెంకటేశ్వర్లు, వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూపీపీలో  పలు లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్లు విలీనం అయ్యేందుకు అంగీకరించాయి.