పెరుగు ప్యాకెట్లు కొంటున్నారా.. ఎలుకలు కూడా వస్తాయి.. జాగ్రత్త.. వరంగల్ లో కలకలం

పెరుగు ప్యాకెట్లు కొంటున్నారా.. ఎలుకలు కూడా వస్తాయి.. జాగ్రత్త.. వరంగల్ లో కలకలం

గ్రేటర్ వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌‌‌‌ సిటీలోని ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్‌‌‌‌లో ఎలుక పిల్ల కనిపించడం కలకలం రేపింది. వినియోగదారుడు ఆదివారం దుకాణంలో పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాడు. ప్యాకెట్ కట్ చేయగా అందులో ఎలుక పిల్ల కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌‌‌‌కు గురయ్యాడు. వెంటనే దుకాణానికి వెళ్లి నిర్వాహకులను నిలదీయగా వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు.