నవంబర్ 18న ఆర్మూర్‌‌‌‌లో రథోత్సవం

 నవంబర్ 18న ఆర్మూర్‌‌‌‌లో రథోత్సవం
  • 18న ఆర్మూర్‌‌‌‌లో రథోత్సవం 

ఆర్మూర్, వెలుగు: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవనాథ సిద్దులగుట్ట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఆర్మూర్‌‌‌‌లో రథోత్సవంతో సప్తహారతి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు సిద్దులగుట్ట ఆలయ పూజరి కుమార్ శర్మ తెలిపారు.  గురువారం కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్‌‌‌‌లకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 17న సోమవారం గుట్టపై సామూహిక సహస్ర లింగార్చన నిర్వహించనున్నామని తెలిపారు.

18న సాయంత్రం సీతారామ, లక్ష్మణుడు, ఆంజనేయులు, అయ్యప్ప ఉత్సవమూర్తులతో గుట్ట నుంచి దోభీ ఘాట్, పెద్దబజార్, శివాజీ చౌక్, పాతబస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు రథోత్సవంతో గిరి ప్రదక్షిణ కొనసాగుతుందని వివరించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు జిమ్మి రవి, భారత్ గ్యాస్ సుమన్, రామా గౌడ్, చరణ్ రెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్, సతీష్, బట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు.